Advertisement
Google Ads BL

పిక్ టాక్: బాలీవుడ్ మూవీలో చైతు న్యూ లుక్


కరోనా సెకండ్ వేవ్ ముందు నాగ చైతన్య నటించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. కరోనా అడ్డం పడడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసింది టీం. అదే టైం లో థాంక్యూ మూవీ షూటింగ్ తో ఇటలీలో ఉన్న నాగ చైతన్య కూడా సెకండ్ వేవ్ ముప్పు కి ముందే ఇండియాకి వచ్చేసాడు. సెకండ్ వేవ్ ముగియడంతో నాగ చైతన్య తన సినిమా షూటింగ్స్ కి రెడీ అయ్యారు. ఇక బాలీవుడ్ నాగ చైతన్య అమీర్ ఖాన్ లాల్ సింగ్ చెడ్డ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చైతు ఫుల్ గా మేకోవర్ అవ్వబోతున్నాడనే టాక్ నడిచింది. 

Advertisement
CJ Advs

అన్నట్లుగానే నాగ చైతన్య ముంబై కి చేరుకున్నాడు. లఢక్ లో లాల్ సింగ్ చద్దా షూట్ కోసం వెళ్ళిపోయాడు. అక్కడ అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా షూట్ లొకేషన్ నుండి నాగ చైతన్య ఓ పిక్ ని షేర్ చేసాడు. అందులో అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు, నాగ చైతన్య సెల్ఫీ తీసుకున్న పిక్. అందులో చైతు ఫుల్ గా కొత్త లుక్ లో మారిపోయాడు. నీట్ గా షేవ్ చేసుకుని, ఆర్మీ డ్రెస్ లో కనిపిస్తున్నాడు. చైతు షేర్ చేసిన ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అక్కినేని ఫాన్స్ చైరు న్యూ లుక్ చూసి పండగ చేసుకుంటున్నారు. 

Naga chaitanya - Aamir Khan from Lal Singh Chaddha sets:

Naga Chaitanya poses with Aamir Khan, Kiran Rao on the sets of Lal Singh Chaddha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs