Advertisement
Google Ads BL

విష్ణు ప్రియ మనసుకి నచ్చినవాడెవరంటే..


బుల్లితెర మీద పటాస్, ఇంకా ఇతర షోస్ తో బాగా పాపులారిటీ సంపాదించిన యాంకర్ విష్ణు ప్రియా ఇప్పుడు బుల్లితెర మీద కన్నా ఫోటో షూట్స్ మీదే మనసు పెట్టింది. లో దుస్తులతో, అందాలు ఆరబోసే ఫోటో షూట్స్ తో, రోజుకో రీతిలో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో విష్ణు ప్రియా హాట్ ఫోటో షూట్స్ నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. మరి ఇంత గ్లామర్ గా ఫోటో షూట్స్ చేయించుకుని.. బుల్లితెరని వదిలేసి వెండితెరకు ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్ లో విష్ణు ప్రియా ఉందా అనుకుంటున్నారు. బుల్లితెర మీద శ్రీముఖి, విష్ణు ప్రియల ఫోటో షూట్స్ ఎప్పుడు హైలెట్ అవుతూనే ఉంటాయి. 

Advertisement
CJ Advs

అయితే తరుచు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్న విష్ణు ప్రియా తనకి ఎలాంటి భర్త కావాలనే విషయాన్ని రివీల్ చేసింది. అది బాలీవుడ్‌లో సూపర్ బ్లాక్ బస్టర్ అయిన ఆషికీ-2 హీరో ఆదిత్య రాయ్ కపూర్ లాంటి భర్త తనకు కావాలని అంటుంది విష్ణుప్రియ. అది ఈ జన్మలో తీరకపోయినా.. వచ్చే జన్మలో అయినా అలాంటి భర్త తనకి దక్కితే ఎంతో సంతోషిస్తానని చెప్పి షాకిచ్చింది. మరి ఆదిత్య కపూర్ లో విష్ణు ప్రియకి అంతగా ఏం నచ్చిందో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Vishnu Priya is open about marriage:

Vishnu priya wants a husband like Bollywood hero Aditya Roy Kapoor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs