Advertisement
Google Ads BL

మహేష్ ఛాన్స్ ఇవ్వాలిగా..


మహేష్ బాబు తో మణిరత్నం మూవీ.. అప్పడెప్పుడో వచ్చిన ప్రకటన ఇది. కానీ ఇంతవరకు పట్టాలెక్కింది లేదు. మహేష్ బాబు - మణిరత్నం కాంబోలో అదిరిపోయే లవ్ స్టోరీ రావడం ఖాయమని అనుకున్నారు. కానీ అనుకుని ఏళ్ళు గడుస్తున్నా దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఆ మధ్యలో సుహాసిని రత్నం గారు.. మహేష్ తో మూవీ ఉంటుంది కానీ ఎప్పుడో చెప్పలేమంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం కూడా క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement
CJ Advs

మణిరత్నం ప్రొడక్షన్ లో తొమ్మిదిమంది దర్శకులు తొమ్మిది కథలతో నవరస అనే వెబ్ సీరీస్ తెరకెక్కించారు. ఆ వెబ్ సీరీస్ ఇంటర్వ్యూలో మణిరత్నం సర్ ని మహేష్ మూవీ గురించి కదపగా.. మ‌హేష్ తో సినిమా చేయాల‌నుకున్న మాట నిజమే అని చెబుతున్నారు.. మహేష్ తో ఆ సినిమాపై చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. కానీ సినిమా చెయ్యడం కుద‌ర్లేదు. భ‌విష్య‌త్తులో ఓ మంచి క‌థ దొరికితే.. మ‌హేష్ తో సినిమా చేస్తా అంటూ చెప్పారు. 

మరి మణిరత్నం సర్ ఈసారి పాన్ ఇండియా కథతోనే రావాలి. సర్కారు వారి పాట, త్రివిక్రమ్ మూవీస్ తర్వాత మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్ కి వెళ్ళిపోతాడు. రాజమౌళి తో మహేష్ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తారు. అంటే మణిరత్నం మీద గౌరవం ఉన్నా.. ఆయనకి మహేష్ ఛాన్స్ ఇవ్వాలిగా అంటున్నారు. 

Mani Ratnam clarity about Mahesh movie:

Mani Ratnam to direct Mahesh Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs