Advertisement
Google Ads BL

శర్వా - సిద్దు ఇంత ఫాస్ట్ గానా?


శర్వానంద్‌ - సిద్ధార్ధ్ కాంబోలో డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో మ‌హాస‌ముద్రం సినిమా తెరకెక్సుతుంది. RX100 తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ గా మహాసముద్రాన్ని అజయ్ భూపతి తెరకెక్కించారు. శర్వా - సిద్దార్ధ్ క్రేజీ కాంబినేష‌న్‌ని క్యాష్ చేసుకోవ‌డ‌మే కాదు ఒక ప‌ర్‌ఫెక్ట్ కమర్షియల్ చిత్రానికి అవసరమైన  అన్ని అంశాల‌తో రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఒక డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అధితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్, గ‌రుడ రామ్‌ ఫ‌స్ట్‌లుక్స్‌కి  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Advertisement
CJ Advs

మేక‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ కాకుండా ఏ ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ని రిలీజ్ చేయ‌న‌ప్ప‌టికీ ఈ సినిమాపై భారీ అంఛనాలు ఏర్ప‌డ్డాయి. సెకండ్ ముగియకముందు వాయిదా పడిన మహాసముద్రం షూటింగ్.. మళ్ళీ మొదలు అవడమే కాదు... శర్వా - సిద్దు కాంబో సీన్స్ తో సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసేసారు.  

షూట్ ఎంత ఆనందంగా గ‌డిచిందో అనే దానికి ప్రతీకగా విశాఖపట్నం నేపథ్యంలో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ న‌వ్వుతూ ఉన్న పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఇద్ద‌రు పిడికిలి బిగించి న‌వ్వుతూ ఉన్నఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

థియేట్రిక‌ల్ రిలీజ్‌కోసం సిద్ద‌మ‌వుతున్న మ‌హాస‌ముద్రం ప్ర‌మోష‌న్స్ అతి త్వ‌ర‌లో ప్రారంభంకానున్నాయి.

Sharwanand - Siddharth Maha Samudram Shooting Completed:

Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment Maha Samudram Shooting Completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs