Advertisement
Google Ads BL

సంబరాల్లో సూపర్ స్టార్ ఫాన్స్


గత నెల 19 న హెల్త్ చెకప్ కోసం హడావిడిగా కేంద్ర నుండి పర్మిషన్ తెచ్చుకుని.. స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా వెళ్లిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై రజినీకాంత్ ఫాన్స్ ఆందోళనకి గురయ్యారు. గత ఏడాది డిసెంబర్ లో రజినీకాంత్ ఉన్నట్టుండి సిక్ అవడంతో ఆయన్ని హైదరాబాద్ షూటింగ్ నుండి చెన్నై కి తరలించారు. మూడు నెలల రెస్ట్ తర్వాత రజినీకాంత్ మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చారు. ఆ తర్వాత ఆయన నటిస్తున్న అన్నత్తే షూటింగ్ ని ఫినిష్ చేసారు. ఆతర్వాత ఆ సినిమా డబ్బింగ్ కూడా హుటా హుటిన పూర్తి చేసి.. ఆమెరికా ప్రయాణం పెట్టుకున్నారు. 

Advertisement
CJ Advs

ఇక రజినీకాంత్ ఆరోగ్య కారణాల దృశ్య సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే టాక్ నడవడం, మధ్యలో రజినీకాంత్ కూడా సినిమా నుండి తప్పుకోబోతున్నట్టుగా హింట్ ఇవ్వడంతో రజిని ఫాన్స్ ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఇక రెగ్యులర్ హెల్త్ చెకప్ అని చెప్పినా ఫాన్స్ లో అందోళన పెరిగిపోయింది. మరికొంతమంది నటులు రజిని ఆరోగ్యం గురించి బయటికి చెప్పాలంటూ బహిరంగంగా విమర్శిస్తున్నారు. అయితే అమెరికాలో ఆయన హెల్త్ చెకప్ పూర్తి చేసుకుని నేడు ఆరోగ్యంగా రజినీకాంత్ చెన్నై కి వచ్చేసారు. 

అమెరికా నుండి స్పెషల్ ఫ్లైట్ లో ఆయన ఈ రోజు ఉదయమే చెన్నై కి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో తలైవా అంటూ రజిని ఫాన్స్ ఆయనకి స్వాగతం పలికారు. రజినీకాంత్ యాక్టివ్ గా ఉండడం చూసిన ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 

Rajinikanth to return to Chennai from the US:

Superstar to return to Chennai from the US
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs