Advertisement
Google Ads BL

రాజుగారి ముందు వెనకబడిన అల్లు అరవింద్


ఒకప్పుడు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అంటే అల్లు అరవిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ మీద సినిమాలు తీసి సక్సెస్ సాధించి కోట్లు గడించిన అల్లు అరవింద్ దూకుడు తగ్గిందా? లేదంటే మారేదన్నానా? ఎందుకంటే టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అంతా పాన్ ఇండియా ఫిలిమ్స్ తో దూసుకుపోతుంటే.. అల్లు అరవింద్ మాత్రం ఆయన కొడుకు అల్లు అర్జున్ సినిమానే వేరే నిర్మాణ సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడు కానీ.. సొంతంగా ఓ పాన్ ఇండియా మూవీ ని నిర్మించడానికి తెగ ఆలోచిస్తున్నాడు. అల్లు అరవింద్ రామాయణంపై ఎప్పటికప్పుడు మీడియాలో న్యూస్ రావడమే కానీ.. ఆయన ముందడుగు వేసింది కనిపించడం లేదు. 

Advertisement
CJ Advs

కానీ మరో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాత్రం కోలీవుడ్ హీరోలు, టాలీవుడ్ హీరోలతో పాన్ ఇండియా కి చెక్కేస్తున్నాడు. వరసగా స్టార్ హీరోల కమిట్మెంట్స్ తో దిల్ రాజు దూసుకుపోతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఓ పాన్ ఇండియా మూవీ ప్రకటించిన దిల్ రాజు రామ్ చరణ్ తో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లోను మూవీస్ నిర్మిస్తూ దిల్ రాజు యమా జోరు చూపిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీస్, టాలీవుడ్, బాలీవుడ్ మూవీస్ అంటూ దూసుకుపోతుంటే.. దిల్ రాజు ముందు అల్లు అరవింద్ మాత్రం వెలవెలబోతున్నాడనిపిస్తుంది. 

Allu Aravind seems dull in front of Dil Raju :

Allu Aravind vs Dil Raju 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs