సినిమా మొదలు పెట్టేముందు నటులు, టెక్నీషియన్స్ డేట్స్ అన్ని సరి చూసుకుని సినిమాని మొదలు పెడతారు దర్శకులు. ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా సినిమాకి కావల్సిన అన్ని ఏర్పాట్లతో సెట్స్ మీదకి వెళతారు. హీరోయిన్స్ అయితే మూడు నాలుగు సినెమాలతోను, అలాగే కేరెక్టర్స్ ఆర్టిస్ట్ లు, కీలక నటులు నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా వుంటారు. హీరోలైతే ఒక సినిమా అయ్యాక మరో సినిమా చేస్తారు కానీ.. మిగతా వారు అలా కాదు.. వాళ్ళకి సినిమాల్లో రోల్స్ నిడివి ఎక్కువ ఉండదు కాబట్టి నాలుగైదు సినిమాలు ఒకేసారి చేస్తారు.
అయితే ఇప్పుడు కరోనా లాక్ డౌన్స్ వలన సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. చాలా సినిమాలు లాస్ట్ షెడ్యూల్ దగ్గరే ఆగిపోయాయి. ఇప్పుడు పోస్ట్ కరోనా షూట్స్ అన్ని ఒకేసారి మొదలయ్యాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకెళ్ళి బ్యాలెన్స్ షూట్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాయి. ఇలాంటి టైం లో హీరోయిన్స్ ని, కేరెక్టర్ ఆర్టిస్ట్స్ డేట్స్ ని, టెక్నీకల్ సిబ్బంది డేట్స్ ని అడ్జెస్ట్ చేసి మళ్ళీ సినిమాని పట్టాలెక్కించడానికి దర్శకులు ఎన్ని పాట్లు పడాలో. ప్రస్తుతం టాలీవుడ్ లో అన్ని సినిమాలు సెట్స్ మీదకెళ్ళాయి. హీరోలంతా షూటింగ్స్ తో బిజీ అయ్యారు.
వీళ్లందరినీ సమీకరిస్తూ షూటింగ్స్ చెయ్యడం అంటే దర్శకులకు మాములు విషయం కాదు. అయితే ముఖ్యంగా హీరోయిన్స్ మాత్రం ఆ సినిమా షూటింగ్ కి ఒకరోజు ఈ సినిమా షూటింగ్ కి మరో రోజు అంటూ హడావిడి పడిపోతున్నారు.