కన్నడ నుండి దూసుకొచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు సొంత భాష కన్నా ఎక్కువగా తెలుగు, బాలీవుడ్ సినిమాలతో ఓ రేంజ్ కి వెళ్ళిపోయింది. రష్మిక తెలుగులో పుష్ప పాన్ ఇండియా ఫిలిం తో ఏకంగా అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. అంతేకాదు.. శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్ల సినిమా చేస్తుంది. బాలీవుడ్ రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న రష్మిక మరో రెండు ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది. ఇక సుల్తాన్ తో తమిళంలో సినిమా చేసిన రష్మిక.. అక్కడ స్టార్ హీరోల తనపై కన్నెయ్యకపోతారా అని ఎదురు చూస్తుంది.
జిమ్ లో వర్కౌట్స్ తో పర్ఫెక్ట్ ఫిగర్ కోసం కష్ట పడుతున్న రష్మిక జోరు మాములుగా లేదు. తెలుగు, హిందీ, తమిళ సినిమాలే కాదు.. ఇప్పుడు కమర్షియల్ యాడ్స్ తోనూ రష్మిక అదరగొట్టేస్తుంది. విజయ్ దేవరకొండ తో సంతూర్ యాడ్ లో నటించిన రష్మిక హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూ యాడ్ లో నటించింది. ఇక తెలుగు లో రష్మిక మరో ప్రాజెక్ట్ ని యంగ్ హీరో సరసన చేయబోతుంది అనే టాక్ మొదలైంది.
అటు సినిమాలు ఇటు కమర్షియల్ యాడ్స్ తో పాప బాగా బిజినె. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కోలీవుడ్ నుండి రశ్మిక్ ఎక్కే ఫ్లైట్ ఎక్కడం దిగే ఫ్లైట్ దిగే పనిలోనే ఉండబోతుంది.