బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి చాలామంది సెలబ్రిటీస్ సంశయించడం కామన్. ఎందుకంటే తమ వ్యక్తిగత వివరాలను బిగ్ బాస్ ఎక్కడ చూపిస్తాడో దాని వలన కెరీర్ డ్యామేజ్ అవుతుంది, అయినా బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్ళు ఏం సాధించారు.. మనం వెళ్లి సాధించాడనికి అని కొందరు.. బిగ్ బాస్ కి ఆఫర్ వచ్చినా వెళ్లే ఆసక్తి చూపరు. నార్త్ లో బిగ్ బాస్ బాగా పాపులర్ అయినా, క్రేజ్ ఉన్నా.. ఇక్కడ సౌత్ బిగ్ బాస్ కి అంతగా ఆదరణ లేదు. అందులోనూ తెలుగు బిగ్ బాస్ కి సెలబ్రిటీస్ ఆదరణ చాలా కరువు. అందుకే ఊరు పేరు లేని యూట్యూబర్స్ ని, టిక్ టాక్ స్టార్స్ ని తీసుకువస్తారు.
అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 విషయంలో యాజమాన్యం కొత్తగా ఆలోచిస్తుందట. అంటే గతంలో పారితోషకాల కన్నా ఇప్పుడు డబుల్ పేమెంట్ ఇచ్చి కాస్త పేరున్న సెలబ్రిటీస్ ని పడేసి బిగ్ బాస్ కి తేబోతున్నట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5 రిచ్ గా సెలబ్రిటీస్ తో కళకళలాడేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా టాక్. అలాగే హోస్ట్ గా నాగార్జున కూడా మారబోతున్నారని అంటున్నారు కానీ.. ఫైనల్ గా మన్మధుడే బిగ్ బాస్ సీజన్ 5 కి హోస్ట్ గా చెయ్యొచ్చు అని అంటున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ నుండి మొదలయ్యే సూచనలు ఉన్నాయట.