Advertisement
Google Ads BL

కెజిఎఫ్ తమిళ రైట్స్ ఆ సంస్థ చేతిలో


కన్నడ సంచలన కెజిఎఫ్ 2 మూవీ అప్ డేట్ అంటూ కెజిఎఫ్ మేకర్స్ అందరిలో ఆత్రాన్ని పెంచేశారు. జులై 16 న విడుదల కావల్సిన కెజిఎఫ్ 2 ఇప్పుడు డిసెంబర్ 21 న రిలీజ్ అవ్వబోతుంది అనే న్యూస్ మొదలైంది. కెజిఎఫ్ మేకర్స్ ఇచ్చే అప్ డేట్ అదే.. కెజిఎఫ్ మూవీ రిలీజ్ డేట్ ని డిసెంబర్ 21 గా ప్రకటించబోతున్నారంటూ ప్రచారం షురూ అయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ రాఖి భాయ్ గా నటిస్తున్న కెజిఎఫ్ పై అన్ని భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. 

Advertisement
CJ Advs

ఇప్పటికే కెజిఎఫ్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో బిజినెస్ మొదలైపోయింది. అందులో ముఖ్యంగా కెజిఎఫ్ తమిళ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తుంది. ఆ ఫిగర్ ఎంత అనేది బయటికి రాలేదు కానీ.. కెజిఎఫ్ తమిళ రైట్స్ ని గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. కెజిఎఫ్ తమిళ డబ్బింగ్, థియేట్రికల్ రైట్స్ ని వారు క్రేజీ డీల్ తో దక్కించుకున్నట్లుగా కోలీవుడ్ మీడియా టాక్. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అధీర పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో రవీనా టాండన్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఏది ఏమైనా కెజిఎఫ్ మూవీ పై అన్ని భాషల్లో విపరీతమైన హైప్ అలాగే క్రేజ్ కూడా ఉంది. 

KGF: Chapter 2 Tamil Rights Sold To A Popular Banner:

KGF: Chapter 2 Tamil Rights Sold To A Green studios
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs