Advertisement
Google Ads BL

ఏపీ స్కూల్స్ రీ ఓపెన్.. ఎప్పటినుండి అంటే


సెకండ్ వేవ్ కారణంగా మూతబడిన ఆంధ్రప్రదేశ్‌ స్కూల్స్, కాలేజెస్ అన్ని ఆగస్టు 16 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నారు. ఆంధ్ర లో స్కూల్స్ ఓపెన్ అయ్యే నిర్ణయాన్ని సీఎం జగన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో తీసుకున్నారు. ఖ్అంతేకాకుండా ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు- నేడు పెండింగ్‌ పనుల పూర్తికి సీఎం జగన్ ఆదేశించారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. 

Advertisement
CJ Advs

నూతన విద్యావిధానాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తోందని మంత్రి ఆదిమూలపు చెప్పారు. . దీని వల్ల ఏ స్కూల్‌ మూతపడదని.. ఏ ఉపాధ్యాయుడి పోస్టు తగ్గదని సురేష్‌ వివరించారు. రెండేళ్లలో ఫౌండేషన్‌ స్కూళ్లకు అదనపు గదులను నిర్మిస్తామన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు 70 శాతం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మార్కులు.. పదో తరగతి నుంచి 30 శాతం మార్కులు కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరు లోపు ఇంటర్‌ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 

Schools in Andhra Pradesh to reopen on August 16:

Schools Reopen in Andhra Pradesh From August 16th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs