Advertisement
Google Ads BL

పిలకతో షాకిచ్చిన విజయ్ దేవరకొండ


టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ పాన్ ఇండియా మూవీ కోసం ముంబైకి చేరుకున్నాడు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చాడు. గత కొన్నాళ్లుగా లైగర్ సినిమా కోసం జిమ్ లో కష్టపడడమే కాదు.. లైగర్ కోసం బాక్సర్ గా హెయిర్ పెంచిన విజయ్ దేవరకొండ అప్పనుండి ఇప్పటివరకు అదే లైగర్ లుక్ ని ఫాలో అవుతున్నాడు. జులపాల జుట్టుతో విజయ్ ట్రావెల్ చేస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్ట్ లో పిలక కట్టుకుని కొత్తగా కనిపించాడు. 

Advertisement
CJ Advs

తన హెయిర్ స్టయిల్ ఎక్కువగా ఉండడంతో విజయ్ దేవరకొండ పిలక వేసుకున్నాడు. లైగర్ సినిమా కోసం లుక్ ని మార్చకుండా ఉండిపోయిన విజయ్ చివరికి తన హెయిర్ తో పిలక వేసుకోవాల్సి వచ్చింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. లైగర్ మూవీలో అనన్య పాండే తో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ పూరి దర్శకత్వంలో కరణ్ జోహార్, ఛార్మి, పూరి కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం విజయ్ దేవరకొండ ముంబై కి చేరుకున్నాడు. రెండు మూడు రోజుల్లో లైగర్ రెస్యూమ్ షూట్ మొదలు కాబోతుంది. ఇప్పటికే పూరి - ఛార్మి లు ముంబై కి వెళ్లిపోయారు. 

Liger Vijay Devarakonda new look gets viral:

Vijay Devarakonda new look goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs