నాగార్జున కి ఎంత ఏజ్ వచ్చినా ఇప్పటికి కుర్రాడిలా మన్మదుడిలా మెరిసిపోతుంటాడు. మంచి ఫిజిక్ తో యాక్టివ్ గా ఉండే నాగార్జున సీనియర్ హీరోల ముందు కుర్ర హీరోలా కనిపిస్తాడు. అఖిల్, నాగ చైతన్య లకి ఇప్పటికి నాగ్ గట్టి పోటీ ఇవ్వగలడు. నాగార్జున అంటే అమ్మాయిలకి పడిచచ్చిపోయేంత ఇష్టమే. ఈ వయసులోనూ నాగ్ అందాన్ని పొగడకుండా ఉండలేరు. అలాంటి నాగ్ ఇప్పుడు షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చాడు. 30 ఏళ్ల యువకుడిలా మెరిసిపోయే నాగార్జున.. పైన కనిపిస్తున్న టాపిక్ లో మెరిసిన జుట్టుతో దర్శనం ఇచ్చి తన అసలు ఏజ్ ని తన అసల లుక్ ని చూపించేసరికి అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి.
అంటే నాగార్జున ఎంత మేకప్ వేస్తె ఇంత కుర్రాడిలా కనిపిస్తున్నాడో అంటూ ఇప్పుడు నాగ్ ని ఆడుకుంటున్నారు నెటిజెన్స్. మెరిసిన జుట్టు, మీసకట్టుతో షాకిచ్చిన నాగార్జున 61 ఏళ్లకు పూర్తి న్యాయం చూసారుగా అంటున్నారు. నాగార్జున ఓల్డ్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే నాగ్ ఆ ఓల్డ్ లుక్ ఎక్కడిది.. దేని కోసం నాగ్ ఆ అవతారంలో కనిపిస్తున్నారు.. అంటూ నెటిజెన్స్ తలలు కొట్టేసుకుంటున్నారు. ఎందుకంటే నాగ్ ప్రవీణ్ సత్తారు మూవీలో రా ఏజెంట్ గా కనిపిస్తున్నారు. ఇక కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు మొదలు కావాల్సి ఉంది.