Advertisement
Google Ads BL

మరోసారి కెలికేశాడుగా


ఇంకా మూడు నెలలు టైం ఉన్న మా ఎలక్షన్స్ విషయంలో నటుడు ప్రకాష్ రాజ్ రచ్చ రచ్చ చేసారు. ఇంకా మా ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కాకుండానే ప్రకాష్ రాజ్ ప్యానల్ అంటూ సబ్యులని ప్రకటించడం, అదే ఊపులో మద్దతు కోసం ప్రయత్నాలు చెయ్యడం, ప్రెస్ మీట్ పెట్టి హాట్ హాట్ గా మాట్లడం దగ్గర నుండి చాలా విషయాల్లో ప్రకాష్ రాజ్ దూకుడు చూపించారు. ప్రకాష్ రాజ్ హడావిడి చూసిన మంచు విష్ణు ఓ లేఖ ని వదిలాడు. 

Advertisement
CJ Advs

మధ్యలో ప్రెజెంట్ మా అధ్యక్షుడు హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి మా ఎలక్షన్స్ కి ఇంకా టైం ఉంది, అప్పుడే కంగారు ఏమిటి అన్నారు. సరే ఓకె నేను ఇంకా మా ఎన్నికల విషయం మాట్లాడను.. నా ప్యానల్ కూడా మాట్లాడదు అంటూ కామ్ అయిన ప్రకాష్ రాజ్ మరోసారి ఎన్నికల కోసం కంగారు పడుతున్నారు. ట్విట్టర్ వేదికగా ఎల‌క్ష‌న్స్ ఎప్పుడు అంటూ ట్వీట్ చేసి.. మరోసారి మా ఎన్నికల విషయాన్ని కెలికాడు. అంతా ప్రశాంతంగా ఉంది.. మా పెద్దలు, సినిమా ఇండస్ట్రీ పెద్ద తలకాయలు అందరూ కలిసి మా ఎన్నికలను ఏకగ్రీవం అయ్యేలా చెయ్యాలని చూస్తుంటే.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ మళ్ళీ ఎన్నికల మేటర్ ని కెలికి వేడుక చూస్తూన్నారు. 

జీవిత కానీ, హేమ కానీ, మంచు విష్ణు కాని అందరూ సైలెంట్ గా ఉన్న టైం లో ప్రకాష్ రాజ్ ఇలా ట్వీట్ చెయ్యడం చూస్తే కెలకడం కాక మరింకేమిటి. 

Prakash Raj tweet on MAA Elections :

Prakash Raj Sarcastically ask Maa when are the elections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs