రాజమౌళి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ హైదరాబాద్ లోనే ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఆర్.ఆర్.ఆర్ షూట్ లో పాల్గొంటున్నారు. టాలీవుడ్ టాప్ ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ ను ఇంతకుముందు ఆర్.ఆర్.ఆర్ కి ఫైట్ మాస్టర్స్ గా పని చేసారు. గతంలోనూ రాజమౌళి తో వర్క్ చేసిన రామ్ - లక్ష్మణ్ లు ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ నుండి బయటికి రావడమే హాట్ టాపిక్ అయ్యింది. అయితే రాజమౌళి లాంటి బిగ్ డైరెక్టర్ తో పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ నుండి ఎందుకు బయటికి వచ్చారో రామ్ లక్ష్మణ్ మాటల్లోనే...
రాజమౌళి తో గతంలో పని చేసాం. ఆ తర్వాత ఆయనతో కొంత గ్యాప్ వచ్చింది. రాజమౌళి పెద్ద సినిమాలు చేస్తుంటారు కాబట్టి.. ఆయనతో పనిచేసే టెక్నీషియన్స్ కూడా ఆయనకు తగ్గట్లుగానే ఉండాలి. ఎక్కువ కాలం ఆయనతో ట్రావెల్ చేసేందుకు రెడీగా ఉండాలి. డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వలన, అలాగే మాకు కూడా పెద్ద సినిమాలు చేయాల్సి వస్తే వరసగా 50 రోజులు ఒక్క సినిమాకే వర్క్ చేయాలి కాబట్టి .. అప్పుడు చాలా సినిమాలను వదులుకోవాల్సి వస్తోంది. అందుకే ఎక్కువగా లాంగ్ షెడ్యూల్ ఉండే సినిమాలు చేయడం తగ్గించాము. ఆర్.ఆర్.ఆర్ మొదలయిన కొత్తలో రామ్ చరణ్ కి గాయం కారణంగా షూటింగ్ ఆపెయ్యాల్సి వచ్చింది.
అప్పుడు మాకు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వలన ఆర్.ఆర్.ఆర్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక రాజమౌళి తో పనిచేస్తే ఆ క్రెడిట్ ఫైట్ మాస్టర్స్ కు అంతగా ఉండదు. ఎందుకంటే ప్రతి షాట్ లో కూడా రాజమౌళి ఆలోచన విధానం ఉంటుంది. యాక్షన్ సీన్ కు తగ్గట్లుగానే కంపోజ్ చేయిస్తారు కాబట్టి ఫైట్ మాస్టర్స్ కంటే ఎక్కువ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. రాజమౌళి అన్ని సన్నివేశాలకు చాలా కష్టపడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు.. అంటూ ఆర్.ఆర్.ఆర్ నుండి ఎందుకు తప్పుకున్నారో వివరణ ఇచ్చారు ఈ ఫైట్ మాస్టర్స్ ఇద్దరూ.