అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో లో పుష్ప సినిమా షూటింగ్ సెకండ్ వేవ్ కి ముందు అల్లు అర్జున్ కి కరోనా రావడంతో ఆపేసారు. తర్వాత లాక్ డౌన్ అంటూ అన్ని షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. అయితే ఈమధ్యన అల్లు అర్జున్ అండ్ టీం గోవా వెళ్లబోతుంది అక్కడే పుష్ప రెస్యూమ్ షూట్ మొదలు కాబోతుంది అంటూ ప్రచారం జరిగినా ఈ రోజు హైదరాబాద్ లో పుష్ప పాన్ ఇండియా మూవీ రెస్యూమ్ షూట్ మొదలైనట్టుగా టీం ప్రకటించింది. అసలైతే నిన్న సోమవారమే పుష్ప షూటింగ్ మొదలు కావల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన ఆగింది.
నేడు మొదలైన పుష్ప షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటుగా పుష్ప నటీనటులు మొత్తం అంటే ఆఖరికి విలన్ పాత్రధారి ఫహద్ ఫాసిల్ కూడా పాల్గొనబోతున్నారని, ఈ షెడ్యూల్ 45 రోజుల పాటు హైదరాబాద్ లోనే జరగబోతుందట. 45 రోజుల వరకు నాన్ స్టాప్ గా షూటింగు జరిగేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ షెడ్యూల్ తో పుష్ప పార్టు 1కి సంబంధించిన షూటింగు పార్టు పూర్తవుతుందని టాక్. సుకుమార్ కూడా ఎట్టి పరిస్తితుల్లో షూటింగ్ కి అంతరాయం కలగకుండా ఉండాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారట.
అల్లు అర్జున్ కూడా 45 రోజుల అపాటు తగ్గేదెలా అంటూ షూటింగ్ కి రెడీ అయ్యారట. ఇక రష్మిక ముంబై నుండి పుష్ప షూటింగ్ కోసం హైదెరాబాద్ కి వచ్చేసింది.