పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి దక్కింది. మిజోరం గవర్నర్‌గా ఆయనను నియమించారు. ఇక కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోత్‌కు గవర్నర్ పదవి ఇవ్వడం గమనార్హం. ఆయన కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. దీంతో కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ఊహాగానాలు బలపడుతున్నాయి.
గవర్నర్ల వివరాలు ఇలా..
మిజోరం గవర్నర్ - కంభంపాటి హరిబాబు
హరియాణా గవర్నర్ - బండారు దత్తాత్రేయ
కర్ణాటక గవర్నర్ - థావర్‌చంద్ గెహ్లోత్
మధ్యప్రదేశ్ గవర్నర్ - మంగూభాయ్ పటేల్
గోవా గవర్నర్ - పీఎస్ శ్రీధరన్ పిళ్లై
త్రిపుర గవర్నర్ - సత్యదేవ్ నారాయణ్
ఝార్ఖండ్ గవర్నర్ - రమేశ్ బైస్
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ - రాజేంద్ర విశ్వనాథ్