దర్శకుడు శంకర్ తో సినిమా అంటే మాములు విషయం కాదు. అనుకున్న బడ్జెట్ కి రెండింతలైతేనే గాని ఆయనతో సినిమా పూర్తవదు. ఇండియన్ 2 సినిమా అప్పుడు దిల్ రాజు శంకర్ తో గ్రాండ్ గా సినిమా ప్రకటించి ఆ తర్వాత చల్లగా జారుకున్నాడు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం శంకర్ దగ్గరికే వెళ్ళాడు. శంకర్ వేసే భారీ సెట్స్, ఆయన టెక్నీకల్ వాల్యూస్ అన్ని కలిపి ఆ సినిమాకి కోట్లలో ఖర్చు అవుతుంది. ఐ, రోబో, 2.ఓ సినిమాలు పరిశీలిస్తే శంకర్ భారీ తనం కళ్ళకు కనిపిస్తుంది. మరి సినిమాల్లోనే అంతగా ఖర్చుపెట్టించే శంకర్ తన కూతురు ఐశ్వర్య పెళ్ళికీ ఎంత ఖర్చుపెట్టి ఉండాలి.
కూతురు ఐశ్వర్య పెళ్లిని బడా బిజినెస్ మ్యాన్ కొడుకు క్రికెటర్ రోహిత్ కి ఇచ్చి మహాబలిపురం లోని ఓ రిసార్ట్స్ లో చాలా అంటే చాలా సింపుల్ గా చేసేసారు. కోవిడ్ కారణంగా సెలెబ్రిటీలని ఆహ్వానించకపోయినా... తమిళనాడు సీఎం స్టాలిన్ ఆ పెళ్ళికి హాజరయ్యారు. అయితే ఎవరిని పిలవని పెళ్ళికి కోట్లు ఖర్చయ్యిందట. సింపుల్ గానే శంకర్ ఆ పెళ్ళికి 10 కోట్లు పైనే ఖర్చు పెట్టారట. కూతురు కోసం కోట్లకు విలువ చేసే ఆభరణాలు, అలాగే పెళ్ళికి డెకరేషన్ ఖర్చులు, పెళ్లి మండపం సెట్ ఇలా కూతురు పెళ్ళికి ఎందులోనూ తక్కువ కాకుండా సింపుల్ గా పది కోట్లు ఖర్చు పెట్టాడట శంకర్.