అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా రెండు పార్టులుగా విడుదల కాబోతుంది అనగానే సినిమాపై విపరీతమైన హైప్ ఏర్పడింది. అలాగే పుష్ప పై ఎంత క్రేజ్ ఉందొ.. IMBD చూపించింది. అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ సెకండ్ వేవ్ కి ముందు ఆపేసారు. ఇంకొంత బ్యాలెన్స్ షూట్ ఉన్న పుష్ప షూట్ రెస్యూమ్ నిన్న సోమవారం నుండి మొదలు పెట్టాలనుకున్నారు. కొత్త షెడ్యూల్ ని గోవాలో మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని టీం మొత్తం గోవాకి వెళ్ళింది.
కానీ నిన్న సోమవారం మొదలు కావాల్సిన పుష్ప షూట్ క్యాన్సిల్ అయ్యింది. కారణాలు తెలియదు కానీ.. ఈ సినిమాలో నటిస్తున్న కీలక పాత్రధారులు ఎవరైనా షూటింగ్ కి రాలేకపోవడంతో షూట్ క్యాన్సిల్ అయ్యిందో తెలియదు కానీ.. అన్ని ఏర్పాట్లతో మొదలు కావాల్సిన షూట్ మాత్రం ఆగింది. ఇక పార్ట్ వన్ లో కొన్ని కీలక సన్నివేశాలు, రెండు సాంగ్స్ చిత్రీకరణ చేసేస్తే పార్ట్ వన్ కంప్లీట్ అవుతుంది. దానితో పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని పుష్ప టీం తొందర పడుతుంటే మధ్యలో ఈ ఆటంకాలేమిటో అంటున్నారు అల్లు అర్జున్ ఫాన్స్.