ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు, ప్రముఖ హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరాం వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. గతంలో శ్రీరెడ్డి వ్యవహారంతో బాగా పాపులర్ అయిన అభిరాం.. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ మాములుగా ఉండదు.. ఓ టాప్ డైరెక్టర్ చేతుల మీదుగా జరుగుతుంది అనుకున్నారు. అయితే నేనే రాజు నేనే మంత్రి టైం లో అభిరాం దర్శకుడు తేజ కి కమిట్ అవడంతో ఆయనే అభిరాం ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చెయ్యబోతున్నాడు. ఇప్పటికే కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినా లాక్ డౌన్ వలన సినిమా మొదలు కాలేదు.
అయితే తాజాగా హైదరాబాద్ లో అభిరాం డెబ్యూ మూవీ సైలెంట్ గా మొదలైపోయింది ఈ ఆదివారం తేజ - అభిరాం కొత్త మూవీ మొదలైంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అహింస అనే పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. నితిన్, గోపీచంద్ లాంటి హీరోలకి తేజ లైఫ్ ఇచ్చినట్టుగానే ఇప్పుడు దగ్గుబాటి హీరో బాధ్యతలను తేజ తీసుకున్నాడు. అంటే తేజ దర్శకత్వంలో అభిరాం అహింస గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్నమాట.