ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ మాములుగా లేదు. రాధేశ్యాం తో రేపో మాపో ఇండియా వైడ్ గా దిగిపోనున్న ప్రభాస్ తర్వాత సలార్ - ఆదిపురుష్ ప్రాజెక్ట్స్ ని పారలల్ గా చెయ్యబోతున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ షూట్ ముంబై లో ప్రభాస్ లేకుండానే మొదలు కాగా.. హైదరాబాద్ లో రాధేశ్యామ్ షూట్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇక సలార్ షూట్ కూడా ఆగష్టు నుండి మొదలు కాబోతుంది. ఆ తర్వాత ప్రభాస్ చెయ్యాల్సిన చిత్రం నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్.
అయితే ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ ని Prabhas25 మూవీ గా చేయబోతున్నాడట. అంటే నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబో కి పని చేస్తున్న సినిమాటోగ్రాఫేర్ ఒకరు ప్రభాస్ 25వ మూవీ ఓ మైలురాయి అని అర్ధం వచ్చేలా పోస్ట్ చెయ్యడంతో.. ఇప్పుడు ప్రభాస్ 23, 24 పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ప్రభాస్ సలార్, ఆదిపురుష్ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్ తో యాక్షన్ మూవీ కి ఓకె చెప్పేసారా?
ఆ నెక్స్ట్ మూవీ ఎవరితో చెయ్యబోతున్నారు అంటూ ఇప్పుడు అందరిలో ఒకటే కన్ఫ్యూజన్ మొదలయ్యింది. మరి ప్రభాస్ 23, 24 దర్శకులు, హీరోయిన్స్ విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.