Advertisement
Google Ads BL

అమీర్ విడాకులు.. ఆమె మెడకు చుట్టుకుంది


అమీర్ ఖాన్ తన రెండో భర్య కిరణ్ రావు తో విడిపోతున్నట్టుగా .. తామిద్దరం అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేసారు. మొదటి భార్య ని వదిలేసి విడాకులు తీసుకుని రెండో భార్యతో 15 ఏళ్ళు కలిసి కాపురం చేసిన అమీర్ ఖాన్ కిరణ్ రావు తో ఎందుకు విడిపోయారో కానీ.. అమీర్ ఖాన్ అలా విడాకుల మేటర్ సోషల్ మీడియాలో కనిపించగానే నెటిజెన్స్ అంతా ఇప్పుడు ఫాతిమా సనా షేక్ మీద పడుతున్నారు. 

Advertisement
CJ Advs

దంగల్ హీరోయిన్ ఫాతిమా పరిచయమయినప్పటినుండి అమీర్ ఖాన్ కి కిరణ్ రావు కి విభేదాలు వచ్చాయని.. దంగల్ మూవీ వలనే అమీర్ ఖాన్ భార్యకి విడాకులు ఇచ్చాడంటూపెద్ద ఎత్తున సోషల్ మీడియాలో #FatimaSanaShaikh పేరుని అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటారు కానీ అసలు పర్ఫెక్ట్ కానేకాదని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు.. అమీర్ కి మూడో భార్య గా ఫాతిమా బేగం రాబోతుంది అంటున్నారు. అమీర్ ఖాన్ మొదటి భార్య కుమార్తె ఐరా ని కంగ్రాట్స్ ఐరా నీకు కొత్త మమ్మీ ఫాతిమా సనా దొరికింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా రీల్ లైఫ్ డాటర్.. రియల్ లైఫ్ వైఫ్‌గా మారబోతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నేషనల్ వైడ్ గా #FatimaSanaShaikh ని ట్రెండ్ చేస్తూ ఆమె పేరు ని అమీర్ ఖాన్ కి లింక్ పెట్టి వాడేస్తున్నారు. 

అమీర్ ఖాన్ తనకన్నా వయసులో చిన్న అయినా ఫాతిమాతో డేటింగ్ కోసం నువ్వు నీ భార్య కి విడాకులిస్తావా అంటూ ఆయన్ని ఆడుకుంటున్నారు. ఇక అమీర్ ఖాన్ తన భార్య తో విడాకులు తీసుకున్నప్పటికీ.. తన కొడుకు బాధ్యతలను ఇద్దరం కలిసే నిర్వర్తిస్తామని, అలాగే సినిమాలుకి కూడా కలిసే పని చేస్తామని, వ్యక్తిగతంగానే విడిపోతున్నామని ప్రకటించింది ఈ జంట. 

Fatima Sana Shaikh trends on twitter:

Aamir Khan-Kiran Rao Divorce Announced: Here's Why Fatima Sana Shaikh Is Trending On Twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs