Advertisement
Google Ads BL

పుష్ప లో అదే బిగ్ ట్విస్ట్ అంట


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప ఫిలిం పై పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే మోస్ట్ అవైటెడ్ ఫిలిం గా రికార్డులు సృష్టిస్తున్న పుష్ప మూవీ అనుకున్న డేట్ అంటే ఆగష్టు 13 కె వస్తుందా? లేదంటే అన్ని సినిమాల డేట్స్ వలే పుష్ప కూడా రిలీజ్ డేట్ మార్చుకుంటుందా అని అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప మూవీ రిలీజ్ డేట్ విషయం పక్కనబెడితే.. ఈ సినిమాపై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు. 

Advertisement
CJ Advs

అదేమిటంటే.. పుష్ప సినిమాలో కమెడియన్ సునీల్ క్రూరమైన విలన్ గా కనిపిస్తాడట. సుకుమార్ సునీల్ కి అంతటి పవర్ ఫుల్ విలన్ పాత్రని రాసాడంట. అంటే మీరు మలయాళ నటుడు ఫహద్ కదా విలన్ అని అనొచ్చు. ఫహద్ ఫస్ట్ పార్ట్ లో కేవలం 20 మినిట్స్ మాత్రంమే  కనిపిస్తాడట. పుష్ప పార్ట్ 1 లో ఎక్కువగా సునీల్ విలనిజమే చూపించబోతున్నారట. ఇదే పుష్ప లో బిగ్ ట్విస్ట్ అంటున్నారు. ఇక ఫహద్ ఫాజిల్ రెండో భాగంలో మాత్రం పూర్తి స్థాయిలో దర్శనమిస్తాడని టాక్ వినిపిస్తోంది. 

ఇక సునీల్ వైఫ్ కేరెక్టర్ లో అనసూయ భరద్వాజ్ కనిపించబోతుందట. అనసూయ రోల్ కూడా ముందు కొంచెమే అనుకున్నా.. ఇప్పుడు రెండు పార్టులు అనేసరికి ఆమె రోల్ నిడివి కూడా పెరిగిందట. హీరోయిన్ రశ్మిక రోల్ పుష్ప రెండు పార్టుల్లో పుష్కలంగా ఉండబోతుందట. 

Big Twist in Pushpa :

Comedian vital twist in Pushpa?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs