అల్లు అరవింద్ మరికొందరు పార్ట్నర్స్ తో కలిసి తెలుగులో ఆహా ఓటిటీని నెలకొల్పి తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతామని శపధం చేసి మరీ చెప్పారు. కొత్త సినిమాలను మాత్రమే కాదు.. ఆహా ఓటిటి నుండి మరింత ఎంటర్టైన్మెంట్ అంటూ సామ్ జామ్ తో సెలబ్రిటీస్ ఇంటర్వూస్ కూడా చేసారు. ఆ షో కోసం టాప్ హీరోయిన్ సమంత ని వాడేశారు. అలాగే ఆ షో కి మెగాస్టార్ చిరు దగ్గరనుండి యంగ్ హీరోస్ విజయ్ దేవరకొండ వరకు తీసుకొచ్చారు. ఆతర్వాత కొన్ని వెబ్ సీరీస్ లు చేసారు. అవి కనీసం వాడుకలో కూడా లేవు.
ఇక కొత్త సినిమాలను రిలీజ్ చేస్తామంటూ చెప్పినా.. అందులో అంత ఇంట్రెస్టింగ్ మూవీస్ రావడం లేదు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ముందు ఆహా బాగా తేలిపోతుంది. అందుకోసమే అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగి ఆహా ని వీలైనంతగా ప్రమోట్ చేసాడు. అయినా ఆహా కి అంత ఆదరణ లభించలేదు. తాజాగా ఆహా నుండి సూపర్ హిట్ సినిమాలు చూపిస్తా మామా అని తమ రాబోయే సినిమాల గురించి ప్రకటించింది ఆహా. మరి కొత్త సినిమాలు అనగానే ప్రేక్షకుల్లో ఆశ పుట్టింది.
అసలే సినిమాలు లేక కరువులో ఉన్న ప్రేక్షకులు ఆహా నుండి ప్రకటన రాగానే అవేమిటో చూసేద్దామనుకుని ఓపెన్ చేస్తే.. ఏముంది లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, నాగశౌర్య లక్ష్య, అమలా పాల్ కుడి ఎడమైతే కొత్త సినిమాలు తప్ప.. మిగతావన్నీ డబ్బింగ్ మూవీస్, పాత సినిమాలైన క్రాక్, 11th అవర్, చావు కబురు చల్లగా, నాంది, సుల్తాన్ వంటి సినిమాల గురించి చెప్పారు. అంతేకాదు రానా నెంబర్ వన్ యారి, సమంత సామ్ జామ్ షో గురించి చెప్పేసరికి.. నెటిజెన్స్ ఈమాత్రం దానికి కొత్త సినిమాలు చూపిస్తారా అంటూ ఆహా ని ఏసుకుంటున్నారు.
అసలు కొంతమంది నెటిజెన్స్ అయితే ఒకప్పుడు యూట్యూబ్ లో డబ్బింగ్ మూవీస్ వచ్చేవి.. అవే ఇప్పుడు ఆహా లో వస్తున్నాయ్ అంటూ కామెంట్స్ చెయ్యడం మరింత హైలెట్ గా మారింది.