Advertisement
Google Ads BL

RC15 పై అదిరిపోయే అప్ డేట్


రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ షూట్ తో పాటుగా ఆచార్య చివరి షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ ఈ వారంలో మొదలు కాబోయే ఆచార్య సెట్స్ లోకి అడుగుపెట్టేస్తాడు. ఇక ఈ సినిమాలు అటు ఇటుగా మరో నెలలో అన్ని పూర్తయ్యి చరణ్ ఫ్రీ అవుతాడు. రామ్ చరణ్ శంకర్ తో చెయ్యబోయే పాన్ ఇండియా మూవీ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవ్వాల్సి ఉంది. అటు శంకర్ కూడా కూతురి పెళ్లి చేసి కూల్ గా వున్నారు. 

Advertisement
CJ Advs

ఆయన చెయ్యాల్సిన ఇండియన్ 2 మేటర్ ఇంకా తెగలేదు. కోర్టు నిర్మాతలకు, దర్శకుడు శంకర్ కి మధ్యన ఓ మధ్యవర్తిగా జెడ్జి ని నియమించింది. ఆ విషయం అలా ఉంటే.. శంకర్ ఇప్పటికే RC15 కి సంబందించిన పనులను తన అసిస్టెంట్స్ చేత మొదలు పెట్టేశారట. అంటే RC15 ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో మొదలయ్యాయట. దిల్ రాజు కూడా వీలైనంత తొందరగా RC15 మొదలు పెట్టాలని చూస్తున్నాడట. అయితే తాజాగా RC15 ముహూర్తం కుదినట్లుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. 

RC15 సెప్టెంబర్ సెకండ్ వీక్ లో పూజ కార్యకలాపాలతో మొదలు పెట్టి.. రెగ్యులర్ షూట్ ని అక్టోబర్ నుండి మొదలు పెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సెప్టెంబర్ రెండో వారంలో పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టెయ్యాలని శంకర్ అండ్ చరణ్ లు డిసైడ్ అయినట్లుగా.. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తుంది. 

Ram Charan - Shankar RC15 opening date locked?:

RC15 update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs