Advertisement
Google Ads BL

అభిజిత్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్


బిగ్ బాస్ హౌస్ లో ఎంతో తెలివిగా గేమ్ ఆడి.. విన్నర్ గా నిలిచిన అభిజిత్ ఆయన తెలివితేటలతో చాలామంది ఆభిమానులని సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ నుండి బయటికి రాగానే కెరీర్ లో ఫుల్ జోష్ లో దూసుకుపోతాడని అనుకున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 ముగిసి కొన్ని నెలలవుతున్నా అభిజిత్ మాత్రం ఇంతవరకు కెరీర్ మొదలు పెట్టలేదు. కెరీర్ లో రీ ఎంట్రీ ఇస్తూ సినిమాలు చేస్తాడని అనుకున్నారు. మధ్యలో అభిజిత్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వరస ఒప్పందాలతో బిజీ కాబోతున్నాడని కూడా అన్నారు. కానీ అభిజిత్ మాత్రం ఇంతవరకు ఓ మూవీ గురించి ప్రకటించింది లేదు. 

Advertisement
CJ Advs

ఇక తాజా న్యూస్ చూసాక అభిజిత్ ఇప్పట్లో సినిమాల్లోకి రావడం కుదరదనిపిస్తుంది. ఒకరకంగా ఇది అభిజిత్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అభిజిత్ ఫిజికల్ టాస్క్ లు ఆడకపోవడానికి కారణం అతని భుజానికి గతంలో దెబ్బతగలడం, ఆ గాయం బిగ్ బాస్ కి వచ్చేవరకు మానకపోవడంతో అభిజిత్ ఫిజికల్ టాస్క్ లు ఆడలేదు. అయితే తాజాగా ఆ గాయం మరింత ఎక్కువవడంతో అభిజిత్ హాస్పిటల్ లో జాయిన్ అవడంతో ఆయన ఫాన్స్ లో ఆందోళన రేకెత్తిస్తుంది. 

కొన్నాళ్లుగా నేను సోషల్ మీడియాలో పోస్ట్ లు చెయ్యడం లేదు. నేను మీతో కనెక్ట్ అయి దగ్గరగా ఉండేందుకు చాలా ప్రయత్నించాను.. గత వారం నుంచి భుజానికి అయిన గాయం మరింత బాధపెడుతోంది. హాస్పిటల్‌కి వెళ్లాను.. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాను.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో అభిజిత్ మళ్ళీ ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటున్నాడా? అందుకే ఇలా హాస్పిటల్ లో ఉన్నడా? అంటే ఇప్పట్లో అభిజిత్ సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చేమో? అంటూ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. 

Bad News For Abhijeet Fans:

Big Boss Winner Abhijeet hospitalized
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs