Advertisement
Google Ads BL

పవన్ కి ఎలాంటి కథ చెప్పలేదు


పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసే డైరెక్టర్స్ లిస్ట్ చాంతాడంత ఉంది. పవన్ ఎప్పుడు ఫ్రీ అవ్వాలి.. ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ ఎప్పుడు పట్టాలెక్కలి. మధ్యలో కరోనా మహమ్మారి. ఇక పవన్ కేవలం సినిమాలే చేస్తున్నారా అంటే మధ్యలో రాజకీయాలు ఒకటి. అయినా వరస సినిమా కమిట్మెంట్స్ తో పవన్ కళ్యాణ్ మాంచి స్పీడు మీదుంటే కరోనా అడ్డంకి గా మారింది. ప్రస్తుతం ఏకే రీమేక్, హరిహర వీరమల్లు షూటింగ్స్ కోసం రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో రాజమౌళి అవకాశం వదులుకున్నారు.. అంటూ ప్రచారం జరగడమే కాదు.. అప్పుడు కొడుకు రాజమౌళి సినిమా వదులుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ కి ఓకె చెప్పారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Advertisement
CJ Advs

ప్రముఖ పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ కి కథ చెప్పడం.. పవన్ ఓకె చెయ్యడం కూడా జరిగిపోయింది అంటూ ఫిలింసర్కిల్స్ లో ఆ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ నేను పవన్ కి ఎలాంటి కథ చెప్పలేదు.. అవన్నీ రూమర్స్ అని కొట్టి పారెయ్యడంతో.. పవన్ మరో సినిమా ఒప్పుకోలేదు.. ఇప్పుడు షూటింగ్స్ సెట్స్ మీదున్న సినిమాల తర్వాత హరీష్, సురేందర్ మూవీలు మాత్రమే చేస్తున్నారని ఓ క్లారిటీ వచ్చింది ఫాన్స్ కి ప్రేక్షకులకి. 

Pawan was not told any story :

Pawan was not told any story says Vijayendra Prasad 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs