Advertisement
Google Ads BL

టీడీపీ పై రోజా ఫైర్


నేడు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ జడ్జ్, ఎమ్యెల్యే రోజా అక్కడ మీడియా తో మట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని పొగుడుతూ.. టిడిపి నేతలపై విరుచుకుపడ్డారు. మహిళలకు ప్రత్యేక చట్టం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని.. కానీ 14 ఏళ్లలో ఏనాడు చంద్రబాబు మహిళల రక్షణ కోసం కృషి చేయలేదన్నారు. టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. 

Advertisement
CJ Advs

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఉమ్మడి జలాశయాలను ఏకపక్షంగా వాడుకోవడం తగదు అంటూ ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన జల వివాదంపై ఆమె స్పందిస్తూ.. ఉమ్మడి జలాశయాలను ఏకపక్షంగా వాడుకోవడం తెలంగాణకు తగదన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఏపీకి అన్యాయం చేయొద్దని కోరుతున్నానన్నారు. జల వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నానని.. లేని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీకి న్యాయం చేయాలని రోజా అన్నారు.

MLA Roja fires on TDP leaders:

MLA Roja Fires On TRS Ministers Over Telangana- AP Water Issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs