Advertisement
Google Ads BL

పోయిన ప్రేమ మళ్ళీ మొదలయ్యిందా


ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీకి హీరోయిన్ ఛార్మి కి మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ ప్రచారం జరిగింది. ఛార్మి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే దేవిశ్రీ తో ఛార్మి ఏడడుగులు వెయ్యబోతుంది అంటూ ప్రచారం కూడా జరిగింది. తర్వాత ఎందుకో ఏమో వారి ఇద్దరికి మధ్యన బ్రేకప్ అవడం.. ఛార్మి కెరీర్ డౌన్ అవడంతో ఛార్మి పూరి జగన్నాధ్ పంచన చేరి ఆయన నిర్మాణ సంస్థలో భాగస్వామిగా మారింది. ఆ తర్వాత ఛార్మి పూరి కనెక్ట్స్ పేరుతొ సినిమాలు నిర్మిస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే ముగిసిపోయిన ప్రేమ మళ్ళీ మొదలయ్యిందా అనే అనుమానం కలిగేలా ఛార్మి దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా ఇండస్ట్రీకి లాంచ్ చేయబోతుంది అనే న్యూస్ నడుస్తుంది. ఎప్పటినుండో దేవిశ్రీ ప్రసాద్ హీరో గా ఇంట్రడ్యూస్ అవ్వాలని చూస్తున్నా టైం కలిసిరాకో, లేదంటే కథ సెట్ అవకో ఆగుతున్నాడు. మరోపక్క మ్యూజిక్ డైరెక్టర్ గా పలు సినిమా ఆఫర్స్ తో బిజీగా వున్నాడు. తాజాగా ఛార్మి దేవి ని హీరోగా పరిచయం చెయ్యడానికి రెడీ అయ్యింది అని, దేవి హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం హర్రర్ డ్రామాగా ఉంటుందని, ఇందులో దేవి గెటప్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందని ఏవేవో న్యూస్ లు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. 

Charmme to produce Devi Sri debut movie?:

Charmee to produce a film with Devi Sri Prasad?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs