Advertisement
Google Ads BL

RT68 అప్ డేట్ వచ్చేసింది


ఈ ఏడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బస్ట‌ర్ హిట్ సాధించిన మాస్ మ‌హారాజ ర‌వితేజ కెరీర్‌లో 68వ మూవీగా శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌గా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతున్న చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు ప్రారంభ‌మైంది. ర‌వితేజ మ‌రియు ఇత‌ర తారాగ‌ణంపై హైద‌రాబాద్‌లో కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు ర‌వితేజ అటువైపు తిరిగి కుర్చొని ఎదో టైప్ చేస్తున్న‌ట్టు చూపించారు. పోస్ట‌ర్‌లోని క‌నిపిస్తున్న‌ అగ్ని ర‌వితేజ పాత్ర యెక్క ఇంటెన్సిటిని చూపించే విధంగా ఉంది.

ప్రభుత్వ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన పాత లేఖ, డెస్క్‌, టైప్‌రైటర్, ఫైల్స్ మొదలైనవాటిని మనం ఈ పోస్ట‌ర్లో గమనించవచ్చు. ఇది చిత్ర కథతో బలమైన సంబంధాన్ని కలిగి ఉన్న అనేక ఇతర అంశాలను కూడా కలిగి ఉంది. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది.

రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌బోతుంది. ర‌వితేజను ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త పాత్ర‌లో చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ‌.

ర‌వితేజ స‌ర‌స‌న మ‌జిలి ఫేమ్  దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో భారీతారాగ‌ణం న‌టిస్తోంది.  

RT68 pre look delights all:

RT68 Pre look shows its power
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs