Advertisement
Google Ads BL

కోట్లు పోసి కారు కొన్న పవన్


చాలా సాదా సీదా గా సింపుల్ గా ఉంటారు పవన్ కళ్యాణ్. ఆయన కి డబ్బు సంపాదించాలని లేకపోయినా.. రాజకీయాల కోసం మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. అలాగే ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండాలని, ఎక్కడో ఒక ఆశ్రమంలో మునిలా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరిక. కానీ మీరు ఇక్కడే అభిమానుల మధ్యనే కొన్నాళ్ళు ఉండాలని ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ చెప్పారట. ఎక్కువగా ఫామ్ హౌస్ లోనే తన పశుసంపద మధ్యన, తోటల మధ్యన గడిపేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడికొక కాస్ట్లీ కారు కొన్నారట. తన లైఫ్ లోనే పవన్ కళ్యాణ్ అంత బడ్జెట్ పెట్టి కారు కొన్నట్లుగా చెబుతున్నారు. 

Advertisement
CJ Advs

వకీల్ సాబ్ కి 50 కోట్లు అందుకున్నారని టాక్ ఉన్నా.. పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాల విషయంలోనూ పారితోషకంలో ఎక్కడా తగ్గలేదట. సో ఆ వచ్చిన డబ్బుతోనే పవన్ అంతటి ధర పెట్టి కారుని కొనేశారట. చాలా కొద్దిమంది సెలబ్రిటీస్ దగ్గర ఉండే ఆ కారు దేశంలోనే అత్యంత విలువైనది. అదే లగ్జరీ రేంజ్ రోవర్ ఎస్‌యూవీ కారు ఇప్పుడు పవన్ కొన్నారట. 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ యొక్క ఆటోబయోగ్రఫీ మోడల్ కారును పవన్ కళ్యాణ్ పేరు మీద బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. 

మరి సాదా సీదా గా ఉండే పవన్ ఇంత రేటు పెట్టి కారు కొనేసరికి అందరూ ఇప్పుడు పవన్ కారు గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన పెద్దగా ఇల్లు, కార్లు కొన్న దాఖలాలు లేవు. కొన్నా ఇంతటి కాస్ట్లీ కారుని ఎప్పుడు కొనలేదు. సో అందుకే పవన్ కారు విషయం ఇప్పుడు అంత హాట్ టాపిక్ అయ్యింది. 

Pawan Kalyan buys a costly SUV:

Pawan Kalyan is soon going to be the owner of a luxury Range Rover SUV
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs