Advertisement
Google Ads BL

బాలీవుడ్ లో విషాదం


గత కొన్నాళ్లుగా బాలీవుడ్ లో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య, ఇంకా చాలామంది యువ నటులు బలవన్మరణం, కోవిడ్ మరణాలు ఇవన్నీ బాలీవుడ్ ని ఊపేస్తున్నాయి. తాజాగా నటి మందిరా బేడీ హస్బెండ్ ప్రముఖ నిర్మాత రాజ్ కౌశల్ మరణం బాలీవుడ్ ని షాక్ కి గురిచేసింది. చాలా సినిమాలకు నిర్మాతగానూ, కొన్ని సినిమాలకు దర్శకుడిగా కూడా పని చేసిన రాజ్ కౌశల్ మరణంతో సినీ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement
CJ Advs

బుధ‌వారం తెల్లవారుఝామున 4.30 నిమిషాల సమయంలో ఆయనకి గుండెపోటు రావడంతో రాజ్ కౌశల్ క‌న్నుమూసిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. రాజ్ కౌశల్ సొంత ఇంట్లో నిద్రిస్తుండగా గుండెపోటు రావడంతో డాక్టర్స్ ని సంప్రదించే లోపే ఆయన తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. నిర్మాత రాజ్ కౌశల్ ఇక లేరనే వార్త తెలిసి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలియజేస్తున్నారు. 

Mandira Bedi husband Raj Kaushal dies:

Mandira Bedi husband Raj Kaushal dies due to heart attack
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs