టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కి రష్మిక కి మధ్యన రెండు సినిమాల అనుబంధం ఉంది, వాళ్ళ పెయిర్ బావుంది.. వాళ్ళు చాలా చనువుగా ఫ్రెండ్లిగా ఉంటారు. అందుకే వాళ్ళ మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. అటు విజయ్ ఇటు రష్మికాలు ఇద్దరూ ఖండిస్తున్నా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం ఆగడం లేదు. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మిక.. విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం అని, తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతుంది. విజయ్ తనకి మంచి స్నేహితుడు అని చెబుతుంది.
ప్రస్తుతం పుష్ప పాన్ ఇండియా ఫిలిం లో అల్లు అర్జున్ తో నటిస్తున్నారు కదా.. అల్లు అర్జున్ గురించి ఏమైనా చెప్పండి అనగానే.. అల్లు అర్జున్‌తో కలిసి నేను పుష్పలో నటిస్తున్నాను. అల్లు అర్జున్ తో కలిసి నటించడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది. షూట్ మొదలవ్వకముందు కెమెరా వెనుక ఎంతో సరదాగా ఉండే వ్యక్తి.. ఒక్కసారి క్యారెక్టర్‌లోకి అడుగుపెట్టగానే.. ఆయన చాలా ప్రొఫెషనల్‌గా మారిపోతారు. అల్లు అర్జున్ మంచి నటుడు అంతేకాదు అద్భుతమైన డ్యాన్సర్. ఆయనతో వర్క్ చేయడాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నా అంటూ విజయ్, అల్లు అర్జున్ ల గురించి ఒక్కముక్కలో తెల్చిపారేసింది రష్మిక మందన్న