సీనియర్ నటి కవిత ఇంట్లో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా నటి కవిత ఇంటిని కబళించి వేసింది. మొన్నటికి మొన్న కరోనా తో కొడుకుని కోల్పోయిన కవిత.. తాజాగా ఆమె తన భర్తని పోగొట్టుకుంది. ఎంతో భవిష్యత్తు ఉంది అనుకుంటున్న ఆమె కొడుకు సంజయ్ రూప్ రెండు వారాల క్రితం కరోనా తో పోరాడుతూ మృతి చెందాడు. కొడుకు మరణ వార్త తెలిసేసరికి ఆమె భర్త దశరథరాజు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా తో పోరాడుతున్నారు.
గత కొన్ని రోజులుగా కవిత భర్త దశరథరాజు హాస్పిటల్ లోనే ప్రాణాలతో పోరాడుతూ సీరియస్ కండిషన్ లో ఉన్న ఆయన మరణించినట్లుగా తెలుస్తుంది. నిన్నగాక మొన్న కొడుకుని కోల్పోయిన కవిత ఇప్పుడు భర్తని కోల్పోయినట్లుగా తెలుస్తుంది. కవిత తన ఇంట్లో వరస విషాదాలతో కృంగుబాటుకి లోనైట్లుగా తెలుస్తుంది. అయితే కవిత భర్త మరణం పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కవిత భర్త మరణం పట్ల పలువురు సినీప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.