బిగ్ బాస్ ప్రేమ జంట బయట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రేమ జంటగా ప్రోజెక్ట్ అయిన మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్ధక్ లు హౌస్ బయటికి వచ్చాక కూడా ఫ్రెండ్ షిప్ ని మెయింటింగ్ చేస్తున్నారు. తరుచు కలుసుకోవడం, అలాగే ఫోన్స్ చేసుకోవడం వంటివి చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఈమధ్యనే మోనాల్ గుజరాత్ నుండి హైదరాబాద్ కి మకాం మార్చేసింది.
అలాగే అఖిల్ వాళ్ళమ్మకి మోనాల్ మీద ఎలాంటి కోపం లేదు.. వాళ్ళు తరుచు వీడియో కాల్ లో మాట్లాడుకుంటారని చెప్పడంతో.. అఖిల్ - మోనాల్ ఫ్రెండ్ షిప్ కాస్త పెళ్లి పీటలెక్కడం ఖాయమని చాలామంది ఫిక్స్ అయ్యారు. తాజాగా అఖిల్ - మోనాల్ స్క్రీన్ షాట్ ఫొటోస్ తో రచ్చ చేసారు. రీసెంట్ గా వీడియో కాల్స్ మాట్లాడుకున్న మోనాల్ - అఖిల్ లు స్క్రీన్ షాట్ లు తీసుకుని షేర్ చేసుకున్నారు. ఆ స్క్రీన్ షాట్స్ లో మోనాల్ అండ్ అఖిల్ లు మోనాల్ ని అఖిల్ గుజ్జులు అని సేవ్ చేసుకోగా.. మోనాల్ అఖిల్ ని అఖిలు అని సేవ్ చేసుకుంది.
అంటే ఇంత ప్రేమగా, ఇంత క్యూట్ గా పిలుచుకుంటున్నారు అంటే.. అఖిల్ - మోనాల్ మధ్యలో సం థింగ్ సం థింగ్ ఫిక్స్ అంటున్నారు ఫాన్స్.