అఖండ మూవీ షూటింగ్ కోసం రెడీ అవుతున్న బాలకృష్ణ వీడియో ఒకటి ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారింది. బాలకృష్ణ గురించి ఆయనతో అఖండ మూవీ చేస్తున్న బోయపాటి దగ్గరనుండి ఆయనతో పని చేసిన దర్శకులు, ఆయన అన్నకొడుకులు ఏం మాట్లాడారో ఆ వీడియో లో ఉంది. సిల్వర్ స్క్రీన్ లో ఆయనతో పని చేసిన దర్శకులు, ఆయన అన్న బిడ్డలు ఆ వీడియో లో ఏం మాట్లాడారో ఒకసారి చూసెయ్యండి.
అఖండ డైరెక్టర్ బోయపాటి: బాలకృష్ణ నిలువుటద్దంలాంటి వ్యక్తి. ఆయన ముందుకు వచ్చి ఎవరెలా కనిపిస్తే ఆయన అలా కనిపిస్తారు.
పైసా వసూల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్: బాలయ్యబాబుకు ఒక క్యారెక్టర్ ఉంది. మాట మీద నిలబడతారు. మనుషులకు విలువిస్తారు.
కోడి రామకృష్ణ: నిజాన్ని నిర్భయంగా చెప్తాడు. పాత్ర నచ్చిందంటే జీవిస్తాడు. ఆయనలా ఇంకెవరూ చేయలేరనిపిస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్: బాలయ్య.. ఆయనకు కొడుకులు తక్కువ.. అభిమానులు ఎక్కువ.. మీ అందరితో పాటే నేను.
కల్యాణ్‌రామ్: మన బాలయ్య.. మా బాబాయ్.
తారకరత్న: తాతగారి తర్వాత ఈ రోజు కూడా నందమూరి పేరుని చెప్పుకొని తిరుగుతున్నాం. ఆ బరువు బాధ్యతలు.. పేరు ప్రఖ్యాతులను భుజం మీద వేసుకొని నడిపిస్తున్న ఒకే ఒక వ్యక్తి నందమూరి బాలకృష్ణ.