Advertisement
Google Ads BL

Sharwa30: ఒకే ఒక జీవితం


శ్రీకారంతో మంచి హిట్ అందుకున్న శర్వానంద్ RX 100 డైరెక్టర్ అజేయ భూపతి దర్శకత్వంలో సిద్దార్ధ్ తో కలిసి మహాసముద్రం అనే మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. ఆ తర్వాత క్రేజీ, టాప్ హీరోయిన్ రష్మిక మందన్నతో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ రష్మిక తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మంచి జోరు మీదున్న శర్వానంద్ తన నెక్స్ట్ మూవీ శర్వా30 టైటిల్ విషయంలో గత మూడు  మీడియాలో హడావిడి మొదలు పెట్టాడు. 

Advertisement
CJ Advs

#Sharwa30 టైటిల్ ని లుక్ ని అనుకున్న రోజే అనుకున్న అనుకున్న టైం కి రిలీజ్ చేసేసాడు. శర్వానంద్ తన 30 వ సినిమాని ఒకే ఒక జీవితంగా చెయ్యబోతున్నాడు. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.ఈ పోస్టర్‌లో ఒక వైపు పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. మరొక వైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్, ఫ్లైట్ ని చూపించారు. ఈ పోస్టర్ ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఉంది.

క్రేజీ బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్ గా ఈ సినిమాలో శర్వా తో రొమాన్స్ చేయబోతుంది. కమెడియన్ ప్రియదర్శి, వెన్నెలకిషోర్, అక్కినేని అమల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న Sharwa30 టైటిల్ ఒకే ఒక జీవితం అంటూ శర్వానంద్ భుజాన గిటార్ వేసుకుని మరీ దిగిపోయాడు. శర్వా30 ఒకే ఒక జీవితం సినిమాని శ్రీకార్తీక్  డైరెక్ట్ చేస్తున్నాడు. ఎంతో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న Sharwa30 లుక్ అండ్ టైటిల్ ని మీరు చూసెయ్యండి.   

Sharwa30 title and look out:

Oke Oka Jeevitham: Sharwa30 title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs