జబర్దస్త్ లో సుధీర్ - రష్మీ ల ప్రేమ కథ ఎనిమిదేళ్లుగా నడుస్తూనే ఉంది. సుధీర్ - రష్మీ పెళ్లి చేసుకోకపోయినా.. ప్రేమించుకోకపోయినా జబర్దస్త్, ఢీ స్టేజ్ మీద మాత్రం వాళ్ళిద్దరిని ప్రేమికులుగానే ప్రోజెక్ట్ చేస్తున్నారు. రష్మీ కానీ, సుధీర్ పాపులర్ అవ్వడానికి వారి లవ్ ట్రాక్ ముఖ్యమైన కారణం. ఇప్పుడు అదే జబర్దస్త్ స్టేజ్ మీద మరో ప్రేమ జంటగా గా ఇమ్మాన్యువల్ - జబర్దస్త్ వర్షాలు పాపులర్ అవుతున్నారు. వాళ్ళ మధ్యన ఏం ఉన్నదో తెలియదు కానీ.. రోజా దగ్గరనుండి అందరూ ఇమ్మూకి - వర్షకి ముడిపెట్టేస్తున్నారు. తాజాగా జబర్దస్త్ ప్రోమో లో ఇమ్మాన్యువల్ పక్కన పెళ్లి కూతురుగా మరో అమ్మాయిని చూడగానే వర్ష ఎమోషనల్ అవడం.. దానిని రోజా రెచ్చగొట్టడం హాట్ టాపిక్ గా మారింది.
ఆ స్టేజ్ మీద ఇమ్ము పక్కన మరో అమ్మాయిని చూసిన వర్ష మొహం మాడిపోగా.. ఏమైంది వర్ష ఇమాన్యువల్ వేరొకరిని పెళ్లి చేసుకుంటే ఏమైంది అనగా.. ఇమ్మూకు మరో అమ్మాయితో గానీ పెళ్లైతే చచ్చిపోతాను అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకోవడమే కాదు ఇష్టమైన వాళ్లకు మరొకరితో పెళ్లైతే తట్టుకోవడం కష్టం.. లైఫ్ అంతా మనం ఊహించుకున్న స్థానంలో మరొకరు వచ్చి చేరితే బతకలేం అంటూ వర్ష ఎమోషనల్ గా చెప్పడం పక్కనే ఉన్న ఇమ్మాన్యుయేల్ షాక్ అయిపోయాడు. మరి నిజంగానే ఇమ్మాన్యువల్ - వర్ష లవ్ లో ఉన్నారా?లేదంటే జబర్దస్త్ వాళ్ళే ఇలా స్టేజ్ మీద హైప్ క్రియేట్ చేస్తున్నారో కానీ.. ప్రెజెంట్ అయితే వర్ష - ఇమ్మాన్యువల్ ల ప్రేమ, కామెడీ నుండి ఎమోషనల్ వరకు వెళ్ళింది.