సూపర్ స్టార్ రజినీకాంత్ ఈమధ్యనే రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్రం నుండి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుని మరీ పాండమిక్ సిట్యువేషన్ లో రజిని అమెరికా ప్రయాణం హాట్ టాపిక్ గా మరింది. తాజాగా రజినీకాంత్ అమెరికా క్లినిక్ దగ్గర ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇప్పుడు నటి కస్తూరి రజినీకాంత్ అమెరికా ప్రయాణంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రజినీకాంత్ సూపర్ స్టార్ అయ్యుండి.. ఇలాంటి కరోనా సిట్యువేషన్ లో అమెరికా వెళ్లడం చూసిన వారు రజినీకి రూల్స్ వర్తించవా? అసలు ఆయనకు అంత పెద్ద ఆరోగ్య సమస్య ఏం ఉంది?. రెగ్యులర్ చెకప్ కి అమెరికానే వెళ్లాలా?
కరోనా టైం లో ప్రముఖులే విదేశాలకు వెళుతుంటే.. సామాన్యులు ఎలా ఆగుతారు. ఇకపై ఫాన్స్ అంతా తలైవాకు రూల్స్ వర్తించవు అనే డైలాగ్స్ కొడతారమేమో.. ఇప్పుడు రజినీకాంత్ ని ఇలా ప్రశ్నించినందుకు ఆయన ఫాన్స్ కి కోపం రావొచ్చు. గతంలో రజిని కి సపోర్ట్ చేశాను. ఆయనతో కలిసి చాలా విషయాల్లో పోరాటాలు చేశాను. అవి కూడా గుర్తు చేసుకోవాలి. అయినా రజిని కాంత్ ఆయన ఆరోగ్యం విషయాన్నీ చెప్పాలి. గతంలో జయలలిత హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఆవిడ హెల్త్ విషయం తెలుసుకోవాలని చాలామంది అనుకున్నట్లుగా నేనూ రజినీకాంత్ గారి హెల్త్ విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అయితే రజిని మాత్రం ఆరోగ్యంగా ఉండాలి.. జయలలిత లా అవ్వకూడదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.