తమిళంలో ఇండియా 2, విక్రమ్ సినిమాలతో పాటుగా.. పొలిటికల్ గా బిజీగా ఉంటున్న కమల్ హాసన్ మలయాళ సూపర్ హిట్ ఫిలిం దృశ్యం 2 ని రీమేక్ చెయ్యబోతున్నారు. దృశ్యం 2 మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అవడమే తరువాయి టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తెలుగులో రీమేక్ చేసేసారు. ఇక తమిళనాట దృశ్యం1 లో కమల్ - గౌతమి జంటగా నటించగా.. ఇప్పుడు దృశ్యం 2 లో మాత్రం కమల్ గౌతమి ప్లేస్ లోకి మీనని సంప్రదించాలనుకున్నారు.
కమల్ కి గౌతమి కి మధ్యన విభేదాలు తలెత్తడంతో కమల్ వేరే హీరోయిన్ ని తీసుకోవాలని చూసి మలయాళంలో, తెలుగులో నటించిన మీనా అయితే బావుంటుంది అనుకున్నారు. కానీ గౌతమి ప్లేస్ లోకి మీనా కాదు.. మీనా అయితే రొటీన్ అయ్యిపోతుంది. తెలుగు దృశ్యం లో డిఐజిగా నటించిన నదియా ని అయితే బావుంటుంది అని ఆమెని తీసుకోబోతున్నారట. టాలీవుడ్ దృశ్యం లో డిఐజి గీత గా నటించిన నదియా ఇప్పుడు తమిళంలో కమల్ వైఫ్ గా కనిపించబోతుంది. దాదాపుగా నదియా ఎంపిక పూర్తయ్యింది అని.. త్వరలోనే దృశ్యం 2 పట్టాలెక్కబోతున్నట్లుగా తెలుస్తుంది.