Advertisement
Google Ads BL

కత్తి మహేష్ హెల్త్ అప్ డేట్


క్రిటిక్ కత్తి మహేష్ రెండు క్రితం నెల్లూరు దగ్గర హైవే పై మహేష్ కారు లారీని ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వలన అతను ప్రమాదం నుండి బయటపడగా.. మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన తీవ్రగాయాలపాలయ్యాడు. అక్కడనుండి మహేష్ ని నెల్లూరు లోని మెడికోర్ హాస్పిటల్ లో జాయిన్ చెయ్యగా.. ఆయనకీ అక్కడ ప్రాధమిక చికిత్స అందించగా.. కత్తి మహేష్ ని మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో హాస్పిటల్ కి తరలించారు. ఈ రోజు ఆయనకి ఆపరేషన్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

మరోవైపు కత్తి మహేష్ కి ఈ రోడ్డు ప్రమాదంలో రెండు కళ్లు దెబ్బతిన్నాయి. ఎడమ కన్ను చూపు పూర్తిగా పోయిందని వైద్యులు చెబుతున్నట్టుగా మహేష్ మేనమామ శ్రీరాములు తెలిపారు. ప్రమాదం వల్ల మెదడులో రక్తస్రావం జరగలేదని.. అందువల్ల ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారని.. ఇంకా కత్తి మహేష్ కి వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. 

Kathi Mahesh Health update:

Kathi Mahesh Health update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs