ఏడాదిన్నరగా అలా వైకుంఠపురములో సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్న బన్నీ.. తాజా చిత్రం పుష్ప పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది. పుష్ప ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే పుష్ప మీద ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా అల్లు అర్జున్ - సుకుమార్ పుష్ప రెస్యూమ్ షూట్ గోవా షెడ్యూల్ తో మొదలు కాబోతుంది. అయితే ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతుంది అనేది కూడా తెలిసిందే.
ఓ 30 నిమిషాల పార్ట్ మాత్రం పుష్ప చిత్రీకరణ మిగిలి ఉంది అంటూ ఆ మధ్యన వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఒకటి రెండు నెలలు గట్టిగా షూటింగ్ చేస్తే పుష్ప రెండు పార్టుల షూటింగ్ కంప్లీట్ అవొచ్చనే న్యూస్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫాన్స్ ని ఊపేస్తోంది. పుష్ప పార్ట్ వన్ విడుదల అయ్యాక.. మరో ఆరు నెలల గ్యాప్ తో పుష్ప 2 ని దించే ప్లాన్ లో టీం ఉంది. అంటే ఎలాంటి ఆటంకాలు లేకపోతె గనక పుష్ప షూటింగ్ ఓ రెండు నెలలో కంప్లీట్ అవొచ్చంటున్నారు.
హీరోయిన్ రష్మిక కూడా పుష్ప సినిమాకి డేట్స్ కేటాయించేసిందట. ఫహద్ ఫాసిల్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండడానికి రెడీగా ఉన్నారట. దానితో సుకుమార్ ఏకధాటిన పుష్ప చిత్రీకరణ చెయ్యడానికి రెడీ అవుతున్నారట.