Advertisement
Google Ads BL

బాలకృష్ణ మూవీపై హీరోయిన్ క్లారిటీ


బాలకృష్ణ ప్రస్తుతం అఖండ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా వున్నారు. జులై ఫస్ట్ వీక్ నుండి అఖండ రెస్యూమ్ షూట్ మొదలు కాబోతుంది. బోయపాటి అందుకు సన్నాహాలు మొదలు పెట్టేసాడు. అఖండ షూట్ ఫినిష్ అయ్యి.. రిలీజ్ అయ్యాక గోపీచంద్ మలినేని మూవీ షూటింగ్ కి వెళ్ళిపోతారు బాలయ్య. ఈ సినిమా స్క్రిప్ట్ ని గోపీచంద్ మలినేని పూర్తి చేసుకుని హీరోయిన్స్ ని, నటుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా వున్నారు. ఇక తర్వాత బాలకృష్ణ కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో సినిమా చెయ్యబోతున్నారు.

Advertisement
CJ Advs

ఈ సినిమా లో బాలకృష్ణ కి జోడిగా అనిల్ రావిపూడి మెహ్రీన్ కౌర్ ని ఎంపిక చేసాడు అని, ఎఫ్ 2, ఎఫ్ 3, రవితేజ రాజా ధీ గ్రేట్ మూవీస్ లో మెహ్రీన్ కి హీరోయిన్ గా అవకాశం ఇవ్వడంతో.. దర్శకుడు అనిల్ మాట తీసేయలేక బాలయ్య సరసన నటించడానికి మెహ్రీన్ ఒప్పుకుంది అనే టాక్ మొదలైంది. అయితే తాను బాలయ్య సినిమాలో నటించబోతున్నాను అనే న్యూస్ పై హీరోయిన్ మెహ్రీన్ స్పందించింది. ప్రస్తుతం ఎఫ్ 3 షూటింగ్ చేస్తున్నా అని, అలాగే మారుతీ - సంతోష్ శోభన్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నాను తప్ప మరో సినిమాకి తాను సైన్ చెయ్యలేదని.. తాను ఒకవేళ ఏదైనా సినిమా కథ ఒకే చేస్తే వెంటనే సమాచారం ఇస్తా అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చెయ్యడంతో బాలయ్య మూవీలో మెహ్రీన్ నటించడం లేదని క్లారిటీ వచ్చింది. 

Mehreen Kaur on her next projects:

Mehreen Pirzada shoots for her next with Santosh Shobhan - Maruthi combo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs