Advertisement
Google Ads BL

అలియా భట్ స్పీడు


బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అలియా భట్ బాలీవుడ్ బడా ప్రాజెక్ట్స్ తో పాటుగా.. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో సీతమ్మ గా కనిపించబోతుంది. బ్రహ్మాస్త్ర షూటింగ్ ఫినిష్ అయ్యి రిలీజ్ కి రెడీ అయ్యింది, ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అలియా భట్ సీత పాత్ర చిత్రీకరణ కూడా పూర్తయ్యింది.ఇక అలియా భట్ బాలీవుడ్ లో నటిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఫిలిం గంగూభాయ్ కతీయవాది మూవీ షూటింగ్ ని కూడా పూర్తి చేసేసింది. సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో గంగూభాయ్ జీవిత చరిత్రగా తెరకెక్కుతున్న గంగూభాయ్ కతీయవాడిలో గంగూభాయ్ పాత్రలో అలియా భట్ నటిస్తుంది. 

Advertisement
CJ Advs

కరోనా సెకండ్ వేవ్ ముందు సంజయ్ లీల భన్సాలీకి, అలియా భట్ కి కరోనా పాజిటివ్ రావడం, మహరాష్ట్రలో లాక్ డౌన్ పెట్టడంతో వాయిదా పడిన షూటింగ్ ని అలియా భట్ రీసెంట్ గా జాయిన్ అయ్యి పూర్తి చేసేసింది. మహారాష్ట్ర సర్కార్ అన్ లాక్ ప్రక్రియ మొదలు పెట్టడమే తరువాయి.. అలియా భట్ సంజయ్ లీల తో కలిసి గంగూభాయ్ కతీయవాది సెట్స్ లో జాయిన్ అయ్యి మిగిలిన షూటింగ్ పూర్తి చేసేసి ప్యాకప్ చెప్పేసింది. అలియా భట్ గంగూభాయ్ షూటింగ్ ఫినిష్ అయిన విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది టీం. 

అలియా భట్ కూడా గంగూభాయ్ షూటింగ్ ఫినిష్ చేసేసి దర్శకుడు సంజయ్ కి టీం కి థాంక్స్ చెప్పేసింది. మరి అలియా భట్ స్పీడు తో ఆ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకుని ముందు ప్రకటించినట్లుగా జులై 30 న రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లె అనిపిస్తుంది. 

Alia Bhatt Wraps Up Gangubai Kathiawadi Shoot:

Alia Bhatt wraps up filming Sanjay Leela Bhansali Gangubai Kathiawadi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs