Advertisement
Google Ads BL

సంచలనంగా మంచు విష్ణు లేఖ


మా ఎన్నికలకి నోటిఫికేషన్ వెలువడకుండానే.. గత రెండు రోజులుగా మా ఎలక్షన్స్ మేటర్ హాట్ హాట్ చర్చలకు దారి తీసింది. ఇంకా రెండు నెలలు టైం ఉన్న మా ఎన్నికల వేడి టాలీవుడ్ ని చుట్టేస్తోంది. ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్యానల్ ప్రకటించడమే కాదు.. ప్రెస్ మీట్ పెట్టి అగ్గి రాజేశారు. ఇక నిన్న ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రాజ్ ప్యానల్ పై ఫైర్ అయ్యారు. ఎనిక్కల్లొ పోటీ చేస్తాను అని చెప్పి కామ్ గా ఉన్న మంచు విష్ణు ఓ లేఖని విడుదల చెయ్యడం హాట్ గా మారింది. మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నా అని, తాను సినీ ప‌రిశ్ర‌మ న‌మ్మిన కుటుంబంలో పుట్టాన‌ని ఆ లేఖ లో పేర్కొన్నారు. 

Advertisement
CJ Advs

సినిమా ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌లు, క‌ష్ట‌న‌ష్టాల గురించి త‌న‌కు తెలుస‌ని అన్నారు. త‌న‌కు, త‌న కుటుంబానికి ఎంతో పేరు, ప్రతిష్ఠ‌లు అందించిన ఈ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఎంతో రుణ‌ప‌డి ఉన్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఆ రుణం తీర్చుకోవ‌డానికి ఈ ప‌రిశ్ర‌మ‌కు సేవ చేయ‌డం త‌న క‌ర్త‌వ్యంగా భావిస్తున్నాన‌ని తెలిపారు. అంతేకాకుండా నా తండ్రి మోహన్‌బాబు మా అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, నాయకత్వ లక్షణాలు ఇప్పుడు నాకు మార్గదర్శకాలయ్యాయి. గతంలో మా అసోసియేషన్‌కు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసినప్పుడు మా బిల్డింగ్‌ ఫండ్‌కి నా కుటుంబం తరఫున నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25శాతం అందిస్తానని మాట ఇచ్చాను. కానీ ఇప్పటివరకు మా భవన నిర్మాణం మొదలు కాలేదు. 

మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం.అందరికి అందుబాటులో ఉంటాం. మా అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా నా సేవలు సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను.. అంటూ ఆ లేఖలో విష్ణు తనేం చెప్పాలి అనుకుంటున్నాడో స్పష్టంగా తెలియజేసాడు. 

Manchu Vishnu pens a letter to MAA Elections:

Manchu Vishnu address a letter on MAA Elections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs