Advertisement
Google Ads BL

మోనాల్ అంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు


బిగ్ బాస్ ప్రేమ పక్షులు అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ అక్కడ బిగ్ బాస్ లో బాగా పాపులర్ అయ్యి.. బయటకొచ్చాక కూడా ఫ్రెండ్లీ గా పార్టీలు గట్రా చేసుకుంటూ తెగ హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే అఖిల్ - మోనాల్ కలిసి ఓ వెబ్ సీరీస్ కూడా చేస్తూ వాళ్ళ క్రేజ్ ని వాడేస్తున్నారు. అయితే మోనాల్ - అఖిల్ పెళ్లి చేసుకుంటారా అనే విషయం ఎప్పటికప్పుడు వాళ్ళ ముందు పెడుతున్నారు యాంకర్స్. కానీ అస్పష్టమైన ఆన్సర్స్ ఇచ్చే అఖిల్, మోనాల్ లు ఇప్పుడు డైరెక్ట్ గా దొరికిపోయినట్లే కనిపిస్తున్నారు. 

Advertisement
CJ Advs

అఖిల్ మోనాల్ తో చాలా ప్రేమగా ఉండి.. తన తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు మోనాల్ తో ప్రవర్తించిన తీరు చూసి.. మోనాల్ ని కాస్త దూరం పెట్టాడు. అంటే అఖిల్ వాళ్ళమ్మకి మోనాల్ అంటే ఇష్టం లేదంటూ అప్పట్లో చాలా వార్తలొచ్చాయి. కానీ తాజాగా అఖిల్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా అమ్మకి మోనాల్ అంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు.. రోజు వాళ్లిద్దరూ నైట్ వీడియో కాల్ లో గంటలు గంటలు ముచ్చట్లు పెట్టుకుంటారంటూ అఖిల్ రివీల్ చెయ్యడంతో.. అఖిల్ పెళ్ళికి అఖిల్ వాళ్ళ అమ్మకి ఎలాంటి అభ్యంతరం లేదనేది తెలుస్తుంది. మోనాల్ కూడా గుజరాత్ నుండి హైదరాబాద్ కి దుకాణం మార్చేసింది. సో రోజూ అఖిల్ - మోనాల్ కలుసుకోవచ్చన్నమాట. 

Who says Monal doesn’t like that:

Akhil Sarthak Says Monal Is More Than Family 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs