Advertisement
Google Ads BL

డైరెక్టర్ శంకర్ అల్లుడు ఎవరంటే..


కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ ఈ మధ్యన ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. కారణం రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా మూవీ చెయ్యడం, మరొకటి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు మూవీ రీమేక్ చెయ్యడం. ఈ రెండు ఒక ఎత్తైతే.. ఇండియన్ 2 మూవీ క్రాంట్రవర్సీ మరో ఎత్తు. కమల్ తో శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 మూవీ వివాదం కోర్టుకి వెళ్లడంతో శంకర్ తరుచు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం శంకర్ తన సినిమాలకు సంబందించిన అన్ని విషయాలను పక్కనబెట్టి తన కూతురు ఐశ్వర్య పెళ్లి పనుల్లో తలమునకలై ఉన్నారు. ఎప్పుడో కావల్సిన శంకర్ డాటర్ పెళ్లి కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతో మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టారు. 

Advertisement
CJ Advs

అయితే శంకర్ కి కాబోయే అల్లుడు ఓ క్రికెటర్. తమిళనాడుకు చెందిన క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌ తో శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం నిశ్చయమైంది. పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు రోహిత్ తో శంకర్ తన కూతురు పెళ్లిని నిశ్చయించారు. అయితే గ్రాండ్ గా వివాహము జరపాలన్నా కరోనా కారణంగా పెళ్లిని ఇప్పుడు సింపుల్ గా చెయ్యాలని ఇరు కుటుంబాలు నిశ్చయించినట్లుగా తెలుస్తుంది. ఇంకా పెళ్లి డేట్ బయటకి రాలేదు కానీ శంకర్ తన కూతురు పెళ్లిని మహాబలిపురంలో జరపతలపెట్టారట. 

ఈ పెళ్లికి మంచి సెట్లు కూడా వేయిస్తున్నారట శంకర్. మరి సినిమాల్లోనే భారీ సెట్స్ తో భారీ తనం చూపించే శంకర్ కూతురు పెళ్ళికి ఇంకెంత అదిరిపోయే సెట్ డిజైన్స్ వేసి పెళ్లి చేస్తారో చూడాలి అంటున్నారు.

Shankar Alludu is a cricketer:

Shankar daughter Aishwarya to marry cricketer Rohit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs