Advertisement
Google Ads BL

పుష్ప సరికొత్త రికార్డ్


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం పై ఎంత క్రేజ్ ఉందొ.. పుష్ప టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ చూస్తేనే తెలుస్తుంది. పుష్ప టీజర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తూ తగ్గేదే లే అంటుంది. నిజంగానే మాటిమాటికి అల్లు అర్జున్ పుష్ప పై ఎంత నమ్మకం లేకపోతె తగ్గేదే లే అంటూ ఎంతో కాన్ఫిడెన్స్ సినిమాపై చూపిస్తునాడో.. దానిని బట్టే క్రేజు, సినిమాపై హైప్ పెరిగిపోతుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న పుష్ప రెండు పార్ట్ లుగా విడుదల కాబోతుంది అని, పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ లుక్స్, అన్ని సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమా ఆగష్టు లో విడుదల కావాల్సి ఉండగా.. సెకండ్ వేవ్ అడ్డుపడింది. మరి రిలీజ్ డేట్ మారుతుందో..  లేదో..  ఇంకా క్లారిటీ ఇవ్వలేదు టీం. అయితే తాజాగా పుష్ప మరో రికార్డుని సెట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఐఎండీబీ(ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్)కి ఉన్న ఆదరణ.. ఆ క్రేజు తెలిసిందే. ఇప్పుడు అందులో పుష్ప సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇండియాలో ప్రస్తుతం అందరూ ఎదురుచూస్తున్న మూవీ లిస్ట్‌లో పుష్ప రెండో స్థానాన్ని దక్కించుకుని అదరగొట్టేసింది. దీనిని బట్టే అల్లు అర్జున్ - సుక్కు కాంబో పుష్ప పై ఎంత క్రేజ్ ప్రేక్షకుల్లో ఉందో అర్ధమవుతుంది. ఇండియా వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ కాబోతున్న పుష్ప మూవీ పై ఈ దెబ్బకి మరిన్ని అంచనాలు పెరగడం మాత్రం ఖాయం. 

Pushpa is India most awaited film:

Pushpa becomes India most wanted
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs