కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార కి బాలీవుడ్ నుండి ఎన్ని ఆఫర్స్ వచ్చినా.. నయన్ మాత్రం బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. త్రిష, కాజల్, తమన్నా లాంటి వాళ్ళు బాలీవుడ్ అదృష్టాన్ని పరిక్షించుకున్నా నయనతార మాత్రం వెళ్ళలేదు. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతోనే సరిపెట్టుకుంది. తమిళంలో క్రేజీ హీరోయిన్ గా, టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాల్తో దున్నేస్తున్న నయన్ ఇప్పడు బాలీవుడ్ కి ఎంటర్ అవ్వబోతోందనే న్యూస్ నడుస్తుంది.
అట్లీ - షారుఖ్ ఖాన్ కాంబోలో మొదలు కాబోతున్న బాలీవుడ్ స్ట్రయిట్ మూవీ లో నయనతార హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడమే కాదు.. అట్లీ - షారుఖ్ కాంబో మూవీ నయన్ ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. Finally This Pair Has Been Confirmed, Lady Superstar #Nayanthara To Pair Up With Bollywood Badshah #ShahRukhKhan In #Atlee's అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరి నిజంగానే నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా? ఏమో అధికారిక ప్రకటన వచ్చేవరకు సస్పెన్స్ అంటున్నారు.