టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు దున్నేస్తున్న క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే ఇప్పుడు తమిళ్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో స్టార్ హీరోలందరితో నటించిన పూజ హెగ్డే బాలీవుడ్ డైరీ కూడా స్టార్ హీరోల సినిమాలతో నిండిపోయింది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో బీస్ట్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. జులై మొదటి వారం నుండి జార్జియా లో ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది. దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో క్రేజీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఇక ఈ సినిమాలోకి పూజ హెగ్డే లుక్స్, రోల్ ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ప్రస్తుతం, విజయ్ తో డాన్స్ చేసిందెకు పూజ హెగ్డే డాన్స్ రిహార్సల్స్ చేస్తుంది. ఈ విషయాన్నీ పూజ తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. డాన్స్ రిహార్సలస్ బిగిన్ #Thalapathy 65 బీస్ట్ కోసం అంటూ క్యాప్షన్ పెట్టి తాను డాన్స్ రిహార్సల్స్ చేస్తున్న వీడియో ని షేర్ చేసినఁది. ప్రస్తుతం పూజ హెగ్డే తెలుగులో ప్రభాస్ రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ తో పాటుగా అఖిల్, రామ్ చరణ్ సరసన నటిస్తుంది.